Mani SaiTeja: అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్‌ చూడడానికి వెళ్లి హీరో అయ్యాడు

ABN , First Publish Date - 2022-12-28T19:05:42+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)కి అరివీర భయంకర అభిమాని ఆ టీనేజ్ కుర్రాడు. అష్టకష్టాలు పడి ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) ప్రీ రిలీజ్ వేడుకకి పాస్‌లు సంపాదించాడు. ఐకాన్ స్టార్‌ని

Mani SaiTeja: అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్‌ చూడడానికి వెళ్లి హీరో అయ్యాడు
Young Hero Mani Saiteja

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)కి అరివీర భయంకర అభిమాని ఆ టీనేజ్ కుర్రాడు. అష్టకష్టాలు పడి ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) ప్రీ రిలీజ్ వేడుకకి పాస్‌లు సంపాదించాడు. ఐకాన్ స్టార్‌ని సమీపం నుంచి చూసే క్షణాల కోసం తహతహలాడుతూ.... సభా ప్రాంగణం చేరుకున్నాడు. కానీ పోలీసు బాసులు సైంధవుల్లా తన అభిమాన హీరో సమక్షంలోకి చేరుకునేందుకు ససేమిరా అన్నారు. పాస్ చూపించినా ఫలితం లేకపోయింది. కాళ్ళావేళ్ళా పడినా కనికరించలేదు. ఆల్రెడీ లోపల సీట్స్ ఫిల్ అయిపోవడం అందుకు కారణం. ఆ సినిమాలో నటించిన ఇతర నటీనటులు మాత్రం దర్జాగా లోపలకు వెళ్తున్నారు. అప్పుడే ఫిక్సయిపోయాడు.. అప్పటికి ఇంకా మీసాలు కూడా రాని ఆ కుర్రాడు.. హీరో అవ్వాలని సంకల్పించుకున్నాడు. అనుకున్నట్టే ఇప్పుడు హీరో అయ్యాడు. ఆ కుర్రాడే మణి సాయితేజ (Mani SaiTeja).

పేరెంట్స్ ప్రోత్సాహానికి తోడు.. అదృష్టం కూడా కలిసి రావడంతో.. మణితేజకు హీరో అవకాశం తలుపు తట్టింది. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ‘బ్యాట్ లవర్స్’ (Bat Lovers) చిత్రంలో మణితేజకు అవకాశం వరించింది. ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగానే.. ‘రుదాక్షపురం’ (Rudrakshapuram)లో నటించే అవకాశం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. ఆర్.కె. గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇప్పుడు ముచ్చటగా మూడో అవకాశం అతడిని వరించింది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ చిత్రం పేరు ‘మెకానిక్’ (Mechanic). ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ శిష్యుడు మునిశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. మణి సాయితేజ.. ఇలా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.

Updated Date - 2022-12-28T19:06:23+05:30 IST