Vinaro Bhagyamu Vishnu Katha: పాటపై చంద్రబోస్ ప్రశంసలు
ABN , First Publish Date - 2022-12-29T21:01:22+05:30 IST
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). యంగ్ హీరో..
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పర్ధేశీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. సక్సెస్ ఫుల్ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ‘వాసవసుహాస’ అనే మొదటి సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట సాహిత్యంపై తాజాగా టాప్ లిరిసిస్ట్ చంద్రబోస్ ( Lyricist Chandra Bose) ప్రశంసల వర్షం కురిపించారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని (Kalyan Chakravarthy Tripuraneni) ఈ పాటకు సాహిత్యం అందించారు.
‘‘వాసవ సుహాస గమనసుధా
ద్వారవతీ కిరణార్భటీ వసుధా..
అశోక విహితాం కృపానాన్రుతాం కోమలామ్
మనోజ్ఞితం మమేకవాకం..
మయూఖయుగళ మధుసూధనా మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగరధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా..
యోగ నిగమ నిగమార్చనా వశనా
అభయప్రద రూపగుణా నాం
లక్ష్యవిధి విదాన హేసదనా
నిఖిలజన సా లోచనా
యుగ యుగాలుగా ప్రభోదమై
పది విధాలుగా పదే పదే..
పలికేటి సాయమీమన్న
జాడలే కదా.. నువ్వెదికినఏదైనా
చిరుమోవికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా
చిగురేయక ఆగునా నువ్వెళ్లేదారినా
నినునిన్నుగ మార్చినా.. నీనిన్నటి అంచునా
ఓ కమ్మటి పాఠమే ఎటుచూసినా..’’ అనే క్లిష్టమైన పదాలతో.. అచ్చ తెలుగు సాహిత్యాన్ని అందించారు గేయ రచయిత కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. ఈ పాటకు మంచి ఆదరణ లభించి అన్ని వైపుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఈ పాటపై స్పందించి తన హృదయపూర్వక ప్రశంసలు తెలిపారు లిరిసిస్ట్ చంద్రబోస్. ‘‘నేను ఈమధ్య విన్న పాటల్లో చాలా చాలా అరుదైన, విలువైన పాట. వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట-వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం. రాయడానికి ఎంత ప్రతిభ వుండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి భాషా సంస్కరం వుండాలి-కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ఆశంసలు’’ అంటూ చంద్రబోస్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని 2023 ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.