IQ Movie: అదే బ్యానర్‌లో.. అదే టీమ్‌తో..
ABN , First Publish Date - 2022-12-15T20:19:04+05:30 IST
45 ఏళ్లుగా ఎన్నో చిత్రాల్లో నటించాను. తెలుగులో దాదాపు 100 చిత్రాలకు పైగా నటించాను. అలాగే తమిళ్, కన్నడ చిత్రాల్లో 50 చిత్రాల్లో నటించాను. మొత్తం మీద 700కి పైగా చిత్రాల్లో..
కాయగూరల లక్ష్మీపతి (Kayagurala Lakshmipathi) నిర్మాతగా.. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్‌పి మూవీస్ (KLP Movies) బ్యానర్ ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్‌మెంట్ గురువారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్‌బి శ్రీనివాస్ (GLB Srinivas) దర్శకత్వం వహిస్తుండగా.. వరికుప్పల యాదగిరి (Varikuppala Yadagiri) సంగీతాన్ని అందించనున్నారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందిస్తున్నారు. ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన ‘ఐక్యూ’ (IQ) చిత్రం ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని.. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్ (Suman) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ... ఈ నెల 19న మా బ్యానర్‌లో రానున్న రెండో చిత్ర షూటింగ్ మొదలవుతుంది. శ్రీనివాస్‌గారికి నా అభినందనలు. ఐక్యూ కంప్లీట్ చేశాము. అందులో ఉన్నవారినే ఈ చిత్రంలో కూడా తీసుకోవడం జరిగింది. సుమన్‌గారు ఈ చిత్రానికి చాలా హెల్ప్ చేశారు. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. ‘ఐక్యూ’ చిత్రం, అలాగే ఇప్పుడు తెరకెక్కబోతున్న చిత్రం కానీ.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాము. ఫిబ్రవరి ఫస్ట్ నా పుట్టినరోజు. కథ సిద్ధంగా ఉంటే సుమన్‌గారితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే నా ప్రొడక్షన్ నెం3. అవుతుందని కూడా తెలియజేస్తున్నానని అన్నారు. దర్శకుడు జిఎల్‌బి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఐక్యూ చిత్రం మొదటి కాపీ రావడం మరియు ఇదే బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2 కూడా అనౌన్స్‌మెంట్ జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 19 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదొక పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. భారీ తారాగణంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్‌గారు చాలా చక్కగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. (KLP Movies Production No 2)
హీరో సుమన్ మాట్లాడుతూ... ఈ క్రిస్ట్‌మస్‌కి నేను ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు పూర్తయి 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆ కళామతల్లికి ఎంతో రుణపడి ఉంటాను. 45 ఏళ్లుగా ఎన్నో చిత్రాల్లో నటించాను. తెలుగులో దాదాపు 100 చిత్రాలకు పైగా నటించాను. అలాగే తమిళ్, కన్నడ చిత్రాల్లో 50 చిత్రాల్లో నటించాను. మొత్తం మీద 700కి పైగా చిత్రాల్లో నటించాను. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన నా దర్శక నిర్మాతలకి, అలాగే నా తల్లిదండ్రులకి, నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1977లో నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అలాగే పల్లె రఘునాధ్‌రెడ్డి (Palle Raghunatha Reddy)గారు కూడా ఇందులో కలెక్టర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన ఒక మంచి పొలిటీషియన్ మాత్రమే కాకుండా.. ఆయనే స్వయంగా ఓ 70 కాలేజీలు నడుపుతున్నారు. ఈ చిత్రం చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారని చెప్పాలి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ఏ నటుడికైనా సరే హిట్ వచ్చిన తరువాత అవకాశం రావడం గొప్ప కాదు. హిట్లు రాకపోయినా అవకాశం రావడం చాలా గొప్ప అని అన్నారు. హీరో భూషణ్ (Bhushan), హీరోయిన్ అంకిత (Ankitha) మాట్లాడుతూ.. ఈ అవకాశం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.