kajal aggarwal: క్రిస్మస్ కిస్!
ABN , First Publish Date - 2022-12-26T17:25:45+05:30 IST
టాలీవుడ్ మిత్రవిందా (Kajal)కాజల్ పెళ్లి తదుపరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్
టాలీవుడ్ మిత్రవిందా (Kajal)కాజల్ పెళ్లి తదుపరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు తన బిడ్డ (నీల్Neil kitchlu)కు ఆరు నెలలు దాటాయి. దీంతో ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే బాడీ ఫిట్‌నెస్ కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ప్రస్తుతం కాజల్ ‘భారతీయుడు 2’ సినిమాలో నాయికగా చేస్తున్నారు. ఆ పాత్ర కోసం ఆమె సిద్ధమవుతున్నారు.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. క్రిస్మస్ సందర్భంగా తన బిడ్డను ఎత్తుకుని గౌతమ్ కిచ్లుకి లిప్‌లాక్(Liplock) ఇస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘‘క్రిస్మస్‌కు కావలసింది ఇదే’ అని తన భర్త నుంచి ప్రేమను కోరుకుంటున్నట్లుగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. హిందీ, తమిళంలో కాజల్ నటించిన మూడు చిత్రాల విడుదలకు సిద్ధమయ్యాయి. భారతీయుడు-2(bharatheeyudu 2) షూటింగ్ కోసం కాజల్ రెడీ అవుతున్నారు.