Dhanya Balakrishna marriage: దర్శకుడితో ధన్య వివాహం

ABN , First Publish Date - 2022-12-28T11:49:30+05:30 IST

నటి కాల్పిక గణేష్ ధన్య పై ఒక వివాదాస్పదం అయినా వ్యాఖ్యలు చేసింది. (Actress Dhanya married director Balaji Mohan) అందులో ఆసక్తికరమయిన వ్యాఖ్య ఏంటి అంటే, ధన్య బాలకృష్ణ రహస్యంగా దర్శకుడు బాలాజీ మోహన్ ని వివాహం చేసుకుంది అనే విషయం.

Dhanya Balakrishna marriage: దర్శకుడితో ధన్య వివాహం

నటి ధన్య బాలకృష్ణ ఈ మధ్య వార్తల్లో వుంది. ఎందుకంటే ఆమె సహచర నటి కాల్పిక గణేష్ ధన్య పై ఒక వివాదాస్పదం అయినా వ్యాఖ్యలు చేసింది. (Actress Dhanya married director Balaji Mohan) అందులో ఆసక్తికరమయిన వ్యాఖ్య ఏంటి అంటే, ధన్య బాలకృష్ణ రహస్యంగా దర్శకుడు బాలాజీ మోహన్ ని వివాహం చేసుకుంది అనే విషయం. (Kalpika Ganesh made controversial remarks against Dhanya and also about her secret marriage recently) ఈ విషయం మీద కొంచెం చర్చ జరిగింది, ధన్య కూడా కాల్పిక మీద తిరిగి విమర్శలు కూడా చేసింది. అయితే ఇప్పుడు దర్శకుడు బాలాజీ మోహన్ తనకు ధన్యతో వివాహం అయినట్టుగా ఒప్పుకున్నాడు. (It was confirmed by Balaji Mohan himself to the court)

dhanya1.jpg

బాలాజీ మోహన్ ఇంతకు ముందు 'లవ్ ఫెయిల్యూర్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అతను చెన్నై హై కోర్ట్ లో నటి కాల్పిక మీద తన వ్యక్తిగత జీవితం మీద కాల్పిక పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందని ఒక పిటిషన్ వేసాడు. (Balaji Mohan filed a petition in Madras High Court) ఆ పిటిషన్ లోనే అతను ధన్య ని వివాహం చేసుకున్నట్టుగా ధ్రువీకరించాడు. వాళ్లిద్దరూ ఇప్పుడు వివాహం అయినా జంటగా అందులో పేర్కొన్నాడు. అయితే ఇదివరకే బాలాజీ మోహన్ కి అరుణ అనే ఆమెతో పెళ్లయింది, కానీ కొన్నాళ్ల తరువాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు ధన్య ని రెండో వివాహం చేసుకున్నాడు. జనవరిలోనే ధన్య ని వివాహం చేసుకున్నట్టుగా అందులో చెప్పాడు బాలాజీ మోహన్. అలాగే కాల్పిక ని తమ వ్యక్తిగత జీవితాల గురించి బయట పబ్లిక్ కా మాట్లాడవద్దని అందులో బాలాజీ మోహన్ కోర్ట్ ని కోరాడు. ఇప్పుడు ఈ కేసు జనవరి 20 కి పోస్టుపోన్ అయింది. (He requested the court to restrain Kalpika talk about their personal lives)

Updated Date - 2022-12-28T11:49:58+05:30 IST