Chiranjeevi: వీరయ్యకి సంబంధించి ప్రధాన వ్యక్తిని మరిచిపోయా..

ABN , First Publish Date - 2022-12-28T17:00:04+05:30 IST

మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా..

Chiranjeevi: వీరయ్యకి సంబంధించి ప్రధాన వ్యక్తిని మరిచిపోయా..
Waltair Veerayya Movie Team

నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు అయినటువంటి రవితేజ (Ravi Teja) గురించి మీడియా సమావేశంలో చెప్పడం మరిచిపోయాను.. చాలా వెలితిగా అనిపించింది.. అందుకే ఈ ట్వీట్ చేస్తున్నానని తెలుపుతూ.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓ ట్వీట్ చేశారు. చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో డైరెక్టర్ బాబీ (Bobby) రూపొందిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ యమా జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోవడంతో.. మేకర్స్ మంగళవారం ఈ చిత్రం కోసం వేసిన హార్బర్ సెట్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా విశేషాలను చిరంజీవి చెప్పుకొచ్చారు. కానీ కీలక పాత్రలో నటించిన రవితేజ గురించి మాట్లాడలేదు. దీంతో మీడియా సమావేశం పూర్తయిన తర్వాత.. చిరంజీవి ట్విట్టర్ ద్వారా రవితేజ గురించి, ఇందులో ఆయన చేసిన పాత్ర గురించి తెలిపారు.

‘‘ ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ అందరితో, మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా, టీం అందరూ ఎంతో సంతోషంగా, ఈ జర్నీలో వాళ్ల వాళ్ల మెమోరీస్ పంచుకోవడంతో, ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంత సంతృప్తిగా జరిగింది. అయితే నా వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంతో.. చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మరిచిపోయాను. వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర నుంచి, కలిసి షూట్ చేసిన ప్రతి రోజూ రవితో మళ్లీ ఇన్నేళ్లకి చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా చాలా ఉంది. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం..’’ అని మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. (Chiranjeevi about Ravi Teja)

Updated Date - 2022-12-28T17:00:09+05:30 IST