Veerasimha Reddy: వీరసింహారెడ్డి లో ఆస్ట్రేలియా అమ్మాయి

ABN , First Publish Date - 2022-12-28T12:14:00+05:30 IST

'మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి' పాట అందరినీ అలరిస్తోంది. ఈ పాటలో చంద్రిక రవి (Chandrika Ravi) అనే ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఆస్ట్రేలియాలో (Australia) ఓ చిన్న టౌన్ లో పుట్టిన చంద్రిక

Veerasimha Reddy: వీరసింహారెడ్డి లో ఆస్ట్రేలియా అమ్మాయి

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో (Director Gopichand Malineni) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'వీరసింహారెడ్డి' (Veerasimha Reddy), జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. మంచి ఫామ్ లో వున్న ఎస్ థమన్ (Music director S S Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మూడో సింగిల్ గా విడుదలైన 'మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి' పాట అందరినీ అలరిస్తోంది. ఈ పాటలో చంద్రిక రవి (Chandrika Ravi) అనే ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఆస్ట్రేలియాలో (Australia) ఓ చిన్న టౌన్ లో పుట్టిన చంద్రిక, కుటుంబ మూలాలు దక్షిణ భాతరదేశం లో వున్నాయి అని చెప్తోంది. చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలు చూస్తూ పెరిగిందట. ఆమె కెరీర్ లో ఇంత త్వరగా ఇంత పెద్ద అవకాశం వస్తుందని ఆమె అనుకోలేదుట.

chandrika-ravi1.jpg

ఆస్ట్రేలియా లో పెరిగిన ఆమె తన ఇంట్లో దక్షిణ భారత దేశ సంస్కృతిని కొనసాగిస్తారుట. అందుకు ఆమె తన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనింది. ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ ఇంట్లో సౌత్ ఇండియన్ కల్చరే వుండేది. "నాకు మూడేళ్ళు ఉన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యరూపకాలు నేర్పించారు. అలాగే వెస్ట్రన్ కల్చర్స్ కి సంబధించిన డ్యాన్సులు కూడా నేర్చుకున్నాను. మా అమ్మగారు మంచి డ్యాన్సర్. నాన్న గారు తబలా వాయిస్తారు. ఈ రకంగా సౌత్ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అనేది నా జీవితంలో అంతర్భాగం అయ్యింది," అని చెప్పింది చంద్రిక.

chandrika-ravi2.jpg

పాట చిత్రీకరణ మరో రోజులో ముగుస్తుందనగా ఆమెకి వెన్ను కాస్త బెణికింది, దానితో ఆ నొప్పి చాలా బాధ పెట్టింది. ఆమె ఈ సంగతి సెట్ లో ఎవరికీ చెప్పకుండా నొప్పి ఉండగానే అలానే డాన్స్ చేసింది అని చెప్పింది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఆమెకి వస్తుందో లేదో అని. షూటింగ్ అయ్యాక దర్శకుడు గోపీచంద్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Choreographer Sekhar Master) కి నొప్పి గురించి చెపితే, వాళ్ళు నొప్పి వున్నా కూడా అది కనపడకుండా అద్భుతంగా చేసిన ఆమె డాన్స్ కి మంచి కితాబు ఇచ్చారు.

Updated Date - 2022-12-28T12:14:01+05:30 IST