Pushpa 2: అనసూయ రోల్ ఎలా వుండబోతోంది అంటే...
ABN , First Publish Date - 2022-12-29T17:12:05+05:30 IST
దర్శకుడు సుకుమార్ ఈ రెండో భాగంలో అనసూయ పాత్రని బాగా పెచుతున్నాడు అని తెలిసింది. అనసూయ లో పూర్తి విలనిజం ని చూపించాలని సుకుమార్ పాత్రని కొత్తగా డిజైన్ చేసినట్టుగా కూడా తెలిసింది.

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' (Allu Arjun and Sukumar combination 'Pushpa 2') సినిమా ఎలా వుండబోతోంది అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి వుంది. ఈ సినిమా షూటింగ్ కూడా అల్లు అర్జున్ మీద కొంత చిత్రీకరించినట్టుగా సమాచారం. జనవరి రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుగుతుందని, అది కూడా చాలామంది క్యారక్టర్ నటుల కాంబినేషన్ లో ఉంటుంది అని, అందులో యాంకర్ మరియు నటి అయిన అనసూయ కూడా పాల్గొంటుంది అని కూడా అనుకుంటున్నారు. 'పుష్ప' మొదటి భాగం లో అనసూయ పాత్ర అంత పెద్దది కాకపోయినా, వున్న సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. (Anasuya's role designed in a different way by Sukumar as he wanted to showcase her in a special way, says a source)
కానీ దర్శకుడు సుకుమార్ ఈ రెండో భాగంలో అనసూయ పాత్రని బాగా పెచుతున్నాడు అని తెలిసింది. అనసూయ లో పూర్తి విలనిజం ని చూపించాలని సుకుమార్ పాత్రని కొత్తగా డిజైన్ చేసినట్టుగా కూడా తెలిసింది. మొదటి భాగం లో సునీల్ కనిపిస్తాడు, కానీ రెండో భాగం లో సునీల్ పక్క మీదే పది ఉంటాడు, లేవలేదు కదా. అందుకని అనసూయ పాత్రని పెంచి ఆమె చేత విలనిజం చేయించాలని సుకుమార్ ఆలోచన. అలాగే మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), రావు రమేష్ (Rao Ramesh) పాత్రలు కూడా మొదటి భాగం లో కన్నా ఇందులో ఇంకా కొంచెం ఇంటెన్స్ గా వుంటాయని అనుకుంటున్నారు.