నా తీరు మార్చుకునేది లేదు.. నేనింతే!: వనితా విజయ కుమార్‌

ABN , First Publish Date - 2022-02-02T02:08:47+05:30 IST

సినిమాలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఫైర్‌బ్రాండ్‌ వనితా విజయ కుమార్‌ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు షూటింగులు, మరోవైపు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో

నా తీరు మార్చుకునేది లేదు.. నేనింతే!: వనితా విజయ కుమార్‌

హీరో విజయ్‌తో నాకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నాయి. ఆ ఫ్రీడమ్‌తోనే ఆయన గురించి అలా మాట్లాడుతుంటాను.. ఎవరో ఏదో అంటున్నారని నా తీరు మాత్రం మార్చుకోను అన్నారు నటి వనితా విజయ కుమార్. ప్రస్తుతం సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఫైర్‌బ్రాండ్‌ వనితా విజయ కుమార్‌ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు షూటింగులు, మరోవైపు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 


‘‘హీరో విజయ్‌తో నేను నటించినప్పటి నుంచి మంచి సంబంధాలున్నాయి. అపుడు ఆయనతో ఎలా మాట్లాడానో ఇపుడు కూడా అలాగే మాట్లాడుతున్నాను. అతని కోసం మాట్లాడే సమయంలో నా మాటలను ఉన్నట్టుండి మార్చుకోలేను. కానీ, నా మాటలను గమనించిన కొందరు ఏదో పొగరుతో మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. కానీ, మొదటి నుంచి విజయ్‌తో ఆ విధంగానే మాట్లాడుతూ వచ్చాను. ఇపుడు కూడా అదే విధంగానే మాట్లాడుతున్నాను. నా మాటలపై కొందరు విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా నా తీరు మార్చుకునేది లేదు.. నేనింతే..!’’ అని వనిత తేల్చి చెప్పింది.

Updated Date - 2022-02-02T02:08:47+05:30 IST