Trisha: అన్నయ్య కూతురి సమస్య కోసం!
ABN , First Publish Date - 2022-12-18T12:35:01+05:30 IST
త్రిష హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరిమెంటెడ్ చిత్రం ‘రాంగి’. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ అందించిన ఈ చిత్రానికి ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ చిత్రం ఫేమ్ ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు.

త్రిష (trisha) హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరిమెంటెడ్ చిత్రం ‘రాంగి’(Raangi). దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ అందించిన ఈ చిత్రానికి ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ చిత్రం ఫేమ్ ఎం.శరవణన్ (m Saravanan)దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించారు. ఈ చిత్రానికి సి.సత్య సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 30న విడుద చేస్తున్నారు. గత ఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం సెన్సార్ కారణాల వల్ల రివైజింగ్ కమిటీకి వెళ్లి సుమారు 30కి పైగా కట్స్‌తో బయటపడి తాజాగా విడుదలకు సిద్ధమైంది. (Raangi on 30th december)
దర్శకుడు మాట్లాడుతూ ‘‘త్రిషను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది. జర్నలిస్ట్ అయిన ఆమె తన తన అన్నయ్య కుమార్తెకు ఏర్పడిన సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగుతుంది. ఈ కథ విదేశాల వరకూ వెళ్తుంది. యాక్షన్‌తో కూడిన విభిననమైన కథాంశంతో రూపొందుతోంది. ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్ యాక్షన్ వంటి అంశాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. సినిమా సగభాగం ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరించాం’’ అని చెప్పారు.