Angelina Jolie: పెద్ద మనసు చాటుకున్న హాలీవుడ్ బ్యూటీ.. వారికోసం పాకిస్తాన్‌కి..

ABN , First Publish Date - 2022-09-21T19:49:58+05:30 IST

సామాన్య ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వస్తే సహాయం చేయడానికి ముందుండే అతి కొద్దిమంది సినీ తారల్లో ఏంజెలీనా జోలీ (Angelina Jolie) ఒకరు...

Angelina Jolie: పెద్ద మనసు చాటుకున్న హాలీవుడ్ బ్యూటీ.. వారికోసం పాకిస్తాన్‌కి..

సామాన్య ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వస్తే సహాయం చేయడానికి ముందుండే అతి కొద్దిమంది సినీ తారల్లో ఏంజెలీనా జోలీ (Angelina Jolie) ఒకరు. ఆమె అవసరం ఉందనుకుంటే ఎంతటి ప్రమాదకరమైన స్థలానికైనా వెళుతుంది. గత కొన్నినెలల క్రితం యుద్ధం జరుగుతుండగానే యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌కి వెళ్లి అక్కడ పలువురి సహాయం చేసి తన మంచి మనసుని చాటుకుంది. తాజాగా మరోసారి తనలోని పెద్ద మనసుతో ఆకట్టుకుంది.


కొన్నినెలల క్రితం పాకిస్తాన్‌(Pakistan)లో వరదలు (floods) బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దానివల్ల కొన్ని వేలమంది సొంత ఇల్లని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లారు. మరెంతోమంది నిరాశ్రయులు అయ్యారు. వేల కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సహాయం చేయడానికి యునైటెడ్ నెషన్స్ తరుఫున జోలీ పాకిస్తాన్‌కి వెళ్లింది. అక్కడికి వెళుతున్నప్పుడు పాకిస్తాన్ విమానాశ్రయంలో జోలీ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది నెటిజన్లు ఈ వీడియోని చూసి నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి హృదయం ఉన్న నటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రకృతి వైపరీత్యాల మధ్య తన సహాయాన్ని అందించడానికి జోలీ పాకిస్తాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. 2010లో అక్కడ వరదలు ముంచెత్తినప్పడూ, 2005లో భారీ భూకంపం సంభవించినప్పుడు కూడా ఆమె పాకిస్తాన్‌ని సందర్శించింది. కాగా.. ఈ వరదల వల్ల పాకిస్తాన్‌లో దాదాపు 30 బిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.



Updated Date - 2022-09-21T19:49:58+05:30 IST