Trisha Krishnan: దిల్ రాజు వ్యాఖ్యలపై స్పందించిన త్రిష
ABN , First Publish Date - 2022-12-27T15:36:36+05:30 IST
తమిళ స్టార్స్ అజిత్ కుమార్ (Ajith Kumar) మూవీ ‘తుణివు’, దళపతి విజయ్ (Thalapathy Vijay) ‘వారసుడు’ సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులని భారీ అంచనాలు ఉన్నాయి.
తమిళ స్టార్స్ అజిత్ కుమార్ (Ajith Kumar) మూవీ ‘తుణివు’, దళపతి విజయ్ (Thalapathy Vijay) ‘వారసుడు’ సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులని భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాల విడుదలకి సంబంధించి థియేటర్స్ విషయంలో వివాదం నడుస్తోంది. దీని గురించి ‘వారసుడు’ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. తమిళనాడులో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కృష్ణన్ (Trisha Krishnan) తాజాగా స్పందించారు.
త్రిష మాట్లాడుతూ.. ‘నేను వ్యక్తిగతంగా నంబర్స్ గేమ్‌ని నమ్మను. ఇది మీ ఇంతకుముందు సినిమాకి జోడించే ట్యాగ్ మాత్రమే. మీ చివరి చిత్రం మంచి విజయం సాధిస్తే, మీరు నంబర్ 1 అవుతారు. మీ సినిమా కొంత కాలం పాటు విడుదల కాకపోతే, ఆ స్థానంలో మరొకరు ఉంటారు. నేను పని చేయడం ప్రారంభించకముందే, వారు సినీ కెరీర్‌లో చాలా కాలంగా ఉన్నారు. వారి సినిమాలను ఓ ఆడియన్‌గా చూశాను. వారికి ఫ్యాన్ క్లబ్‌లు ఉన్నారు. ఈ నంబర్స్ గేమ్ మనమే ప్రారంభించినట్లు నేను భావిస్తున్నాను. వారిద్దరూ చాలా పెద్ద సూపర్ స్టార్లు. ఎవరు ఎక్కువ పాపులర్ అనేది నేను ఎలా చెప్పగలను’ అని ఆమె తెలిపారు.
కాగా.. తన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై దిల్ రాజు స్పందించారు. తన మాటలను అపార్థం చేసుకున్నారని, ఆ ఇంటర్వ్యూలో చాలా పెద్దగా ఉండగా.. అది కేవలం చిన్న భాగం మాత్రమే అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను సినిమాల ప్రేమికుడిని, ఇప్పటి వరకూ 50 సినిమాలు చేశాను. థియేటర్ సమస్య విషయంలో మాత్రమే విజయ్‌గారూ, అజిత్‌గారూ రెఫరెన్స్ చేశాను. కానీ దానికి బదులు మరేదో విషయం గురించి ప్రచారం చేశారు’ అని చెప్పుకొచ్చారు.