Rajanikanth: లవ్‌ టుడే దర్శకుడితో..!

ABN , First Publish Date - 2022-12-24T11:40:22+05:30 IST

రజనీకాంత్‌ 171వ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఆయన నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్‌ చిత్రం చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రజనీ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు.

Rajanikanth: లవ్‌ టుడే దర్శకుడితో..!

రజనీకాంత్‌ 171(Rajanikanth 171)వ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఆయన నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్‌ చిత్రం చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రజనీ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు. ఇది ఆయన చేస్తున్న 169వ చిత్రం. తదుపరి మరో రెండు చిత్రాలు చేయనున్నారు. రజనీకాంత్‌ తదుపరి మరో రెండు చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. అందులో రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకానుంది. అయితే తాజాగా 171వ చిత్రం గురించి వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనికి ‘డాన్‌’ చిత్రం ఫేమ్‌ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఉన్నట్లుండి ప్రదీప్‌ రంగనాథన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘లవ్‌ టుడే'(Pradeep Ranganathan) చిత్రం అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ను ప్రశంసించారు. విను చక్రవర్తి చెప్పిన కథ అంతగా నచ్చకపోవడంతో ప్రదీప్‌ రంగనాథన్‌ తన 171వ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా అధికారిక ప్రకటన లేదు. ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మించనుంది.

Updated Date - 2022-12-24T11:40:24+05:30 IST