Chinmayi-Nayanatara: ఇలాంటి వారితో ఇంట్లో మహిళలకూ సంరక్షణ ఉండదు
ABN , First Publish Date - 2022-12-24T14:03:04+05:30 IST
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు గాయని చిన్మయి శ్రీపాద. స్ర్తీలపై కామెంట్ చేసిన వాళ్లనే సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటుంటారామె.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi). స్ర్తీలపై కామెంట్ చేసిన వాళ్లనే సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటుంటారామె(Chinmayi Fire on netizens ). తాజాగా మరోసారి నెటిజన్లపై మండిపడ్డారు. నయనతార (Nayanatara)వస్త్రాధారణ, లుక్స్‌పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవత తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార ‘కనెక్ట్’(Connect) ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. తల్లిదండ్రులైన తర్వాత వీరిద్దరూ తొలిసారి పబ్లిక్‌లో సందడి చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఆ ఫొటోలలో నయన్ డ్రెసింగ్‌ను చూసిన కొందరు ఆమె శరీరాకృతిపై అసభ్యకరంగా కామెంట్లు చేశారు. దీనిపై చిన్మయి స్పందించారు. సదరు నెటిజన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘ఒక మహిళ శరీరాకృతి గురించి చెత్త కామెంట్లు చేేస వాళ్లకు ఇంట్లో ఆడపిల్లలలు ఉంటే ఏంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. సమాజంలో మహిళల పట్ల కొంతమంది మగవాళ్ల దృష్టి ఎలా ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో వరుస పోస్ట్‌లు పెట్టారు. ‘‘మహిళలందరూ తమ ఇంటి ఆడపిల్లలను ఇలాంటి పురుషులకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వారు మంచివాళ్లు కాదు. వాళ్ల వల్ల ఇంట్లో వారికి కూడా ఎలాంటి సంరక్షణ ఉండదు. ఈ కామెంట్సే అందుకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు. (Nayanatara dressing issue)