Atlee: తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-12-16T16:18:12+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య ప్రియ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

Atlee: తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య ప్రియ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ‘‘మేం తల్లిదండ్రులం కాబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మీరందరు దీవెనలు అందించాలి. ప్రేమతో అట్లీ, ప్రియ అట్లీ’’ అని ట్విట్టర్‌లో అతడు పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ విషయానికి తెలపగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్నా విష్ చేసింది. ‘‘మీ ఇద్దరికి శుభాకాంక్షలు’’ అని పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌ను అట్లీ రీ షేర్ చేసి.. థ్యాంక్ యూ రష్మిక అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రియ గతంలో కొన్ని సీరియల్స్‌ చేశారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

‘రాజా రాణి’ తో అట్లీ సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. మొదటి సినిమానే సక్సెస్ సాధించడంతో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అట్లీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో మూడు చిత్రాలు చేశాడు. ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి మూవీస్ ఒకదానిని మంచి మరొకటి విజయం సాధించాయి. ప్రస్తుతం ‘జవాన్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్, నయనతార హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందుతుంది. వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Updated Date - 2022-12-16T16:18:13+05:30 IST