మోహన్ లాల్ ‘బరోజ్ ’ మూవీ స్టోరీ లైన్ ఇదే . !
ABN , First Publish Date - 2022-01-06T21:34:03+05:30 IST
మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ‘బ్రోడాడీ, రామ్, మాన్‌స్టర్, ఎలోన్, 12thమేన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు తను తొలి సారిగా దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ మూవీ ‘బరోజ్’ కూడా సెట్స్ పై ఉంది. ఇదో చారిత్రక కథాంశంతో ఫిక్షనల్ స్టోరీగా తెరెక్కుతోంది. ‘వాస్కోడిగామా చనిపోయాకా.. ఆయన నిధికి 400 ఏళ్ళుగా కాపాలాగా కాస్తూంటుంది బరోజ్ అనే భూతం. వాస్కో వారసులు ఎవరైనా వస్తే ఆ నిధిని వాళ్ళకి అప్పగించాలన్నది భూతం ఆలోచన. అంతలో వాస్కో వారసురాల్ని తనే అంటూ ఓ చిన్నపాప బరోజ్ దగ్గరకి వస్తుంది.

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ‘బ్రోడాడీ, రామ్, మాన్‌స్టర్, ఎలోన్, 12thమేన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు తను తొలి సారిగా దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ మూవీ ‘బరోజ్’ కూడా సెట్స్ పై ఉంది. ఇదో చారిత్రక కథాంశంతో ఫిక్షనల్‌గా తెరకెక్కుతోంది. ‘వాస్కోడిగామా చనిపోయాకా.. ఆయన నిధికి 400 ఏళ్ళుగా కాపాలాగా కాస్తూంటుంది బరోజ్ అనే భూతం. వాస్కో వారసులు ఎవరైనా వస్తే ఆ నిధిని వాళ్ళకి అప్పగించాలన్నది భూతం ఆలోచన. అంతలో వాస్కో వారసురాల్ని తనే అంటూ ఓ చిన్నపాప బరోజ్ దగ్గరకి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్యా ఓ బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు జరిగే అనూహ్య సంఘటనల సమాహారే ఈ సినిమా కథాంశం. భూతం బరోజ్ గా మోహన్ లాల్ నటిస్తున్నారు.
ఇందులో మోహన్ లాల్ రెండు ప్రత్యేక గెటప్స్ లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి గుండు గెటప్. ఈ గెటప్‌తో ఉన్న పోస్టర్ ను మోహన్ లాల్ న్యూ ఇయర్ రోజున ట్విట్టర్ హాండిల్ ద్వారా అఫీషియల్ గా రివీల్ చేశారు. ఆ గెటప్ కు అభిమానులు షాకయ్యారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాణంలో ‘బరోజ్’ సినిమా రూపొందుతోంది. ఇందులో పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా విదేశీ నటీమణి పాస్ వేగ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం ఈసినిమాను 3డిలో రూపొందిస్తున్నారు.