ఒక రోజు ముందుగానే ఇండియాలో విడుదల కానున్న మార్వెల్స్ Thor Love and Thunder

ABN , First Publish Date - 2022-06-05T00:31:40+05:30 IST

మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. మార్వెల్ కామిక్స్ నుంచి చివరగా వచ్చిన చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’(Doctor Strange in the Multiverse of Madness).

ఒక రోజు ముందుగానే ఇండియాలో విడుదల కానున్న మార్వెల్స్ Thor Love and Thunder

మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. మార్వెల్ కామిక్స్ నుంచి చివరగా వచ్చిన చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’(Doctor Strange in the Multiverse of Madness). ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 100కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. మార్వెల్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్న మరో సినిమా ‘‘థోర్ లవ్ అండ్ థండర్’’ (Thor:Love and Thunder). క్రిస్ హ్యామ్స్‌వర్త్ (Chris Hemsworth), నటాలీ ఫోర్ట్‌మన్(Natalie Portman) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జులై 8న విడుదల చేయనున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇండియాలో ఒక రోజు ముందుగానే జులై 7న విడుదల చేయనున్నట్టు మార్వెల్ ఇండియా సంస్థ ప్రకటించింది. 


‘థోర్’ ప్రాంచైజీలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఆస్కార్ అవార్డు విజేత తైకా వెయిటిటి (Taika Waititi) దర్శకత్వం వహించాడు. మార్వెల్ ఇండియా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘మార్వెల్ స్టూడియోస్ నుంచి రాబోతున్న ‘థోర్ లవ్ అండ్ థండర్’ ఇండియాలో ఒక రోజు ముందుగానే జులై 7న విడుదల కానుంది. ‘థోర్స్ డే’ కోసం సిద్దంగా ఉండండి’’ అని మార్వెల్ ఇండియా తెలిపింది. ‘థోర్’ ను ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోను విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



Updated Date - 2022-06-05T00:31:40+05:30 IST