Swimming లో జాతీయ రికార్డు బద్దలు కొట్టిన కుమారుడు.. అలా ఎప్పుడూ చెప్పకండంటున్న Madhavan

ABN , First Publish Date - 2022-07-18T17:36:51+05:30 IST

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ..

Swimming లో జాతీయ రికార్డు బద్దలు కొట్టిన కుమారుడు.. అలా ఎప్పుడూ చెప్పకండంటున్న Madhavan

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈ నటుడి కుమారుడు వేదాంత్ మాధవన్ (Vedaant Madhavan) స్విమ్మర్ అనే విషయం తెలిసిందే. ఈ కుర్రాడు ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాడు. అంతేకాదు.. పలు పోటీల్లో అప్పటి వరకూ ఉన్న పలు రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. తాజాగా స్విమ్మింగ్‌లో మరో రికార్డును వేదాంత్ బ్రేక్ చేశాడు.


వేదాంత్ తాజాగా నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో అప్పటి వరకూ ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. దానికి సంబంధించిన వీడియోని మాధవన్ తాజాగా ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అందులో కామెంటర్ మాట్లాడుతూ.. ‘సుమారు 16 నిమిషాల్లో.. 780 మీటర్ల మార్క్ వద్ద ఇప్పటి వరకూ అద్వైత్ పేజ్ పేరు మీద ఉన్న రికార్డును వేదాంత్ బద్దలు కొట్టాడు. అతను తన వేగాన్ని చాలా స్టైల్‌గా, త్వరగా పెంచుకుని రికార్డును సృష్టించాడు. ఇది నేను అస్సలు ఊహించలేదు’ అని చెప్పుకొచ్చాడు.


మాధవన్ సైతం ఆ వీడియోకి.. ‘ఏది చేయలేవని ఎప్పుడూ చెప్పకండి. 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో జాతీయ జూనియర్ రికార్డ్ బద్దలైంది’ అని ఎంతో సంతోషంగా రాసుకొచ్చాడు. ఆయన పోస్ట్‌పై ఓ అభిమాని స్పందిస్తూ.. ‘పిల్లల కారణంగా గుర్తింపు పొందిన తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. మీకు అలాంటి భాగ్యం కలిగింది సార్ !! నాకు మీరంటే చాలా అభిమానం’ అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ సైతం.. ‘మీ ఇద్దరికీ అభినందనలు. ఒక తండ్రిగా మీ కొడుకు విజయానికి చాలా గర్వపడాలి. అలాగే.. కొడుకుగా వేదాంత్ తన తండ్రిని గర్వించేలా చేశాడు. మీరిద్దరూ కలిసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తున్నారు’ అని రాసుకొచ్చాడు.



Updated Date - 2022-07-18T17:36:51+05:30 IST