Met Gala 2022: మార్లిన్ మన్రో డ్రెస్‌‌లో కిమ్ కర్దాసియన్.. దీనికోసం 3 వారాల్లో 7 కేజీలు..

ABN , First Publish Date - 2023-04-15T22:15:44+05:30 IST

స్టైలిష్, డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాసియన్...

Met Gala 2022: మార్లిన్ మన్రో డ్రెస్‌‌లో కిమ్ కర్దాసియన్.. దీనికోసం 3 వారాల్లో 7 కేజీలు..

స్టైలిష్, డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాశియన్. ఈ భామ అక్కడ జరిగే ఏ వేడుకకి హాజరైన ప్రత్యేకమైన వస్త్రధారణతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. 2019లో జరిగిన మెట్‌గాలా షోకి కిమ్ తడి బట్టలతో హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా సైతం మెట్‌గాలా 2022 ఈవెంట్ జరుగుతోంది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఈ బ్యూటీ మరోసారి అందరిని షాక్‌కి గురి చేసింది.




1962లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బర్త్ డే పార్టీకి ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న స్కిన్ టైట్ డ్రెస్‌లో హాజరైంది. ఆ డ్రెస్‌ని ఇటీవలే ఓ వేలంలో 4.8 మిలియన్ డాలర్లకి కిమ్ సొంతం చేసుకుంది. ఆ డ్రెస్‌ని ఈ భామ తాజాగా జరిగిన మెట్‌గాలా ఈవెంట్‌కి వేసుకొని వచ్చింది. అందులో ఎంతో అందంగా అందరి కళ్లని కట్టిపడేసింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పిక్స్‌ని షేర్ చేసిన ఈ బ్యూటీ ఈ డ్రెస్‌ వేసుకోవడం తన అదృష్టమంటూ రాసుకొచ్చింది. 


కిమ్ చేసిన ఆ పోస్ట్‌లో.. ‘మెట్ గాలా, అమెరికాలో యాన్ ఆంథాలజీ ఆఫ్ ఫ్యాషన్. ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీకి పుట్టిన రోజు సందర్భంగా జరిగిన పార్టీ కోసం 1962లో మార్లిన్ మన్రో ధరించిన ఐకానిక్ దుస్తులను.. నేను ఇలా ధరించడం చాలా గర్వంగా అనిపిస్తోంది. డిజైనర్ జీన్ లూయిస్ 6,000 చిన్న అద్దాలను పొందుపరుస్తూ చేతితో తయారు చేసిన అద్భుతమైన స్కిన్‌టైట్ గౌను ఇది. మార్లిన్ మన్రో మరణించిన తర్వాత ఈ డ్రెస్ ధరించిన మొదటి వ్యక్తిగా నిలవడం ఆనందంగా ఉంది. ఈ క్షణం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ డ్రెస్‌ని వేసుకునేందుకు కిమ్ మూడు వారాల్లోనే దాదాపు 7 కెజీలు తగ్గిందట.

Updated Date - 2023-04-15T22:15:44+05:30 IST