Ramya: స్త్రీ ద్వేషంపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంత అయినా ఉంది
ABN , First Publish Date - 2022-12-17T17:56:04+05:30 IST
పఠాన్ (Pathaan) సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకొణె (Deepika Padukone) ధరించిన దుస్తులను ట్రోల్ చేశారు.
పఠాన్ (Pathaan) సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకొణె (Deepika Padukone) ధరించిన దుస్తులను ట్రోల్ చేశారు. హిందువుల మనోభావాలను ఆమె కించపరిచిందని పేర్కొన్నారు. కానీ, సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది దీపికకు అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఇప్పటికే తన మద్దుతును ప్రకటించింది. తాజాగా కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య (Ramya) ఈ జాబితాలోకి చేరింది.
‘‘విడాకులు తీసుకుందనే కారణంతో సమంతను ట్రోల్ చేశారు. అభిప్రాయాన్ని చెప్పినందుకు సాయిపల్లవిని, నటుడి నుంచి విడిపోయినందుకు రష్మికను, కురచ దుస్తుల కారణంగా దీపికను, ఎందరో మహిళలు ఏదో ఒక కారణంగా విమర్శులు ఎదుర్కొంటున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ అందరికి ఉంది. అది ప్రాథమిక హక్కు. దుర్గా దేవి ప్రతి రూపాలే మహిళలు. స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంత అయినా ఉంది’’ అని రమ్య ట్విటర్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది. భాషతో సంబంధం లేకుండా రమ్య అనేక ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసింది. కన్నడ నుంచి ఎక్కువ అవకాశాలు రావడంతో అనేక ఎక్కువ సినిమాల్లో నటించింది.