ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ కానున్న ‘Game Of Thrones’ ప్రీక్వెల్ ‘House of The Dragon’

ABN , First Publish Date - 2022-06-24T00:44:27+05:30 IST

ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్న టివి షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones). హెచ్‌బీవో(HBO) నిర్మించింది. ఈ టివి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎనిమిది సీజన్స్

ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ కానున్న ‘Game Of Thrones’ ప్రీక్వెల్ ‘House of The Dragon’

ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్న టివి షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones). హెచ్‌బీవో(HBO) నిర్మించింది. ఈ టివి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎనిమిది సీజన్స్ అనంతరం ఈ షోను అర్ధాంతరంగా ముగించేయడంతో వారంతా అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో హెచ్‌బీవో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కు ప్రీక్వెల్ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ప్రీక్వెల్‌కు ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ (House of The Dragon) అని టైటిల్ పెట్టింది. తాజాగా హెచ్‌బీవో ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ కు సంబంధించిన ఓ లుక్‌ను అభిమానులతో పంచుకుంది. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ షో ఆగస్టు 21 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది. 


మార్టిన్ రాసిన ‘ఫైర్ అండ్ బ్లడ్’ (Fire and Blood) నవలగా ఆధారంగా చేసుకుని ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ను రూపొందిస్తున్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కు 200ఏళ్ల ముందు జరిగిన ఘటనలను ఈ ప్రీక్వెల్‌లో చూపించనున్నారు. హౌస్ టార్గారియన్ కథను ఇందులో చెబుతారు. ఈ సిరీస్‌లో ఎమ్మా డి ఆర్సీ యువరాణి రెనిరా టార్గారియన్‌(Rhaenyra Targaryen) పాత్రను పోషిస్తున్నారు. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ లో  పాడీ కన్సిడైన్, మాట్ స్మిత్, ఒలివియా కుక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Updated Date - 2022-06-24T00:44:27+05:30 IST