Prabhas: రేయ్ చరణ్.. నువ్వు ఫ్రెండ్‌వా.. శత్రువువా?

ABN , First Publish Date - 2022-12-17T18:52:22+05:30 IST

నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). ఆహాలో ప్రసారం అవుతుంది. సినీ, రాజకీయ రంగాలకు..

Prabhas: రేయ్ చరణ్.. నువ్వు ఫ్రెండ్‌వా.. శత్రువువా?

నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). ఆహాలో ప్రసారం అవుతుంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది సెలబ్రిటీలను బాలయ్య ఈ షోకు ఆహ్వానించాడు. తనదైన శైలిలో ప్రశ్నలను అడుగుతూ సమాధానాలను రాబడుతున్నాడు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ వీక్షణల పరంగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు టాలీవుడ్ హీరో ప్రభాస్, తన స్నేహితుడు గోపిచంద్‌తో కలసి విచ్చేశారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ప్రోమో దాదాపుగా 3.45నిమిషాల పాటు ఉంది. సరదాగా, అల్లరిగా కొనసాగింది. తనను కూడా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య అడిగాడు. శ్రుతి హాసన్ తనను పొగిడినప్పుడు నువ్వు చిన్నగా బాధపడ్డావు కదా నటసింహం చెప్పాడు. షోలో భాగంగా ప్రభాస్ తన స్నేహితుడు హీరో రామ్ చరణ్‌కు ఫోన్ చేశాడు. ప్రభాస్‌‌కు సంబంధించిన ఓ సమాచారాన్ని చెర్రీ లీక్ చేశాడు. దీంతో ప్రభాస్.. ‘‘రేయ్ చరణ్.. నువ్వు ఫ్రెండ్‌వా.. శత్రువువా?’’ అని ప్రశ్నించాడు. అదే సమయంలో షోకు మరో అతిథిగా గోపిచంద్ వచ్చాడు. రాణి గురించే కదా ఆ సమాచారం అని మ్యాచో స్టార్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Updated Date - 2022-12-17T22:56:31+05:30 IST