On sets Raja vikramarka: ఇలా నటించాలన్న మాట!
ABN , First Publish Date - 2022-08-14T01:13:46+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి, అమల జంటగా నటించిన ఏకైక చిత్రం 'రాజా విక్రమార్క'. ఈ సినిమాలో రాధిక మరో హీరోయిన్ గా నటించారు. 'దొంగ మొగుడు' చిత్రం తర్వాత అంటే మూడేళ్ల అనంతరం చిరంజీవి, రాధిక కలసి నటించిన చిత్రం ఇదే. ఫైనాన్షియర్ గా అందరికీ సుపరిచితుడైన డాక్టర్ అమరనాథ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం1990 నవంబర్ 14న విడుదల అయింది.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అమల జంటగా నటించిన ఏకైక చిత్రం 'రాజా విక్రమార్క'(Raja vikramarka). ఈ సినిమాలో రాధిక మరో హీరోయిన్ గా నటించారు. 'దొంగ మొగుడు' చిత్రం తర్వాత అంటే మూడేళ్ల అనంతరం చిరంజీవి, రాధిక కలసి నటించిన చిత్రం ఇదే. ఫైనాన్షియర్ గా అందరికీ సుపరిచితుడైన డాక్టర్ అమరనాథ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం1990 నవంబర్ 14న విడుదల అయింది. జానపద, సాంఘిక అంశాల మేళవింపు 'రాజా విక్రమార్క'.
రవిరాజా పినిశెట్టి (Raviraja pinisetti)ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కమెడియన్ సుధాకర్ ఓ కీలక పాత్ర పోషించారు.. ఆ రోజు... వాహినీ స్టూడియోలో రాజా విక్రమార్క షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అమల, సుధాకర్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, అన్నపూర్ణ ...వీళ్లంతా సెట్ లో ఉన్నారు. చిరంజీవి సుధాకర్ భరతం పట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు రవిరాజా.. వాకింగ్ స్టిక్ తో చిరంజీవి తనని కొట్టబోతుంటే మోకాళ్ళ మీద కూర్చుని సుధాకర్ ప్రాధేయ పడే సీన్ అది. ఎలా నటించాలో మొదట రవిరాజా నటించి చూపించారు. తర్వాత షాట్లో అలాగే నటించారు సుధాకర్. ఈ సీన్ కు సంబంధించిన రెండు స్టిల్స్ మీకు అందిస్తున్నాం. సరదాగా ఓ లుక్ వేయండి.
- వినాయకరావు
