Ntr: తనయుడికి నట పరీక్ష!
ABN , First Publish Date - 2022-07-11T01:47:53+05:30 IST
రామకృష్ణ సినీ స్టూడియోస్ ‘వేములవాడ భీమకవి’ (08.01.1976) చిత్రంలోని స్టిల్ ఇది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహాకవి వేములవాడ భీమకవి. ఈయన కథను తెరకెక్కించాలని, ఆ పాత్రను తన కుమారుడు బాలకృష్ణతో నటింపజేశారు ఎన్.టి.ఆర్. బాలకృష్ణ తండ్రి దర్శకత్వంలో ఏడు చిత్రాల్లో నటించారు.

రామకృష్ణ సినీ స్టూడియోస్ ‘వేములవాడ భీమకవి’ (Vemulavada Bhimakavi)(08.01.1976) చిత్రంలోని స్టిల్ ఇది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహాకవి వేములవాడ భీమకవి. ఈయన కథను తెరకెక్కించాలని, ఆ పాత్రను తన కుమారుడు బాలకృష్ణతో నటింపజేశారు ఎన్.టి.ఆర్. బాలకృష్ణ తండ్రి దర్శకత్వంలో ఏడు చిత్రాల్లో నటించారు. కొడుకును తన నటవారసునిగా పరిశ్రమలో నిలబెట్టాలని నిర్ణయించుకున్న రామారావు (Ntr)మొదట్లో బాలకృష్ణతో(Balakrishna) తీసిన చిత్రాల్లో హీరోగా కాకుండా ద్వితీయ ప్రాముఖ్య పాత్రలనిచ్చారు. ఆ తర్వాతే హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని ‘వేములవాడ భీమకవి’ నిర్మించారు. అందుకనే వాల్ పోస్టర్లలో కూడా ‘బాలకృష్ణ నటించిన’ అన్న ట్యాగ్ లైన్ ప్రముఖంగా ప్రింట్ చేయించారు. ఈ సినిమా బాలకృష్ణకు నిజంగా ఒక అగ్నిపరీక్షే! ఎన్.టి.రామారావు, రాజనాల, సత్యనారాయణ, షావుకారు జానకి, గిరిజ, విజయలలిత, కాంతారావు వంటి అగ్రశ్రేణి సీనియర్ నటీనటుల మధ్య ఆయనకు ఇది నాలుగవ చిత్రం. సింహం కడుపున సింహమే పుడుతుందన్నట్లు నెగ్గుకొచ్చి యీనాటికీ అన్నగారి వారసునిగా కొనసాగుతున్నారు బాలకృష్ణ. ఇందులో ఎన్.టి.రామారావు కళింగ గంగు పాత్ర ధరించారు. ఎన్.టి.ఆర్ కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చిన యీ చిత్రంలో ప్రజాస్వామ్యం గురించి, వినోదపు పన్ను గురించి చెప్పిన డైలాగులు ప్రజల్ని ఆలోచింపజేశాయి. బాలకృష్ణ నటన, కూచిపూడి నృత్య నాటకంలో ఎన్.టి.ఆర్ నర్తనం ప్రజల స్మృతిపథంలో నిలిచిపోయాయి.
– డా. కంపల్లె రవిచంద్రన్, 98487 20478.