Ram gopal Varma: జీవిత కాలానికి సరిపోయే అనుభూతి!
ABN , First Publish Date - 2022-12-17T11:13:24+05:30 IST
‘అవతార్’ మొదటి భాగంలో ప్రేక్షకులను పండోరా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్, రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. ‘అవతార్-2’ థియేటర్‌లో సందడి చేస్తోంది.

‘అవతార్’(Avatar) మొదటి భాగంలో ప్రేక్షకులను పండోరా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్(james cameron), రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. ‘అవతార్-2’ (Avatar 2)థియేటర్‌లో సందడి చేస్తోంది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతినిచ్చింది. సినిమా వీక్షించిన వారంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమా గురించి తన అభిప్రాయాన్ని తనదైన శైలిలో రాసుకొచ్చారు. ‘‘ఇప్పుడే అవతార్ 2లో స్నానం చేసి వచ్చాను. దీనిని సినిమా అనడం క్రైమ్‌తో సమానం. ఎందుకంటే అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచే యాక్షన్‌తో జీవితకాలానికి సరిపోయే అనుభూతిని అందించిన చిత్రమిది. మరోలోకంలో విహరించినట్లు ఉంది’’ అని వర్మ ట్విట్ చేశారు.