Avatar The Way Of Water Twitter Review: జేమ్స్ కామెరూన్ మూవీ ఎలా ఉందంటే..
ABN , First Publish Date - 2022-12-16T10:09:53+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar The Way Of Water). దాదాపు 13 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అవతార్’ (Avatar)కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేల విడుదల అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar The Way Of Water). దాదాపు 13 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అవతార్’ (Avatar)కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేల విడుదల అయ్యింది. జేమ్స్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా నేడు (డిసెంబర్ 16న) విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పడిపోయాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఈ మూవీ ఎలా ఉందో పంచుకుంటున్నారు.
వాటిలో.. ‘మొదటి 90 నిమిషాలు అత్యద్భుతమైన విజువల్స్‌తో నిజమనే భ్రమని కలిగించింది. నీటి అడుగున ఉన్న 25 నిమిషాల విజువల్స్ అయితే మరింత అద్భుతంగా ఉన్నాయి. సెకండాఫ్ కోసం వెయిటింగ్!’ అని ఒకరు.. ‘ఇప్పుడే అవతార్ 2 చూశాను. కానీ కథ సాదాసీదాగా ఉంది. కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. సమస్య ఏమిటంటే కథ మొత్తం ఒకే వైపు సాగుతుంటుంది’ అని మరొకరు.. ‘అవతార్ 2లో పూర్తి పండోరాని చూపించాడు. దానికి కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. సినిమా కోసం నటీనటులను నిజంగానే నీటిలోకి తీసుకెళ్లాడు. అది సినిమాకి జీవాన్ని ఇచ్చింది. ఇది స్వచ్ఛమైన జేమ్స్ కామెరూన్ సినిమా మ్యాజిక్!’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. మరికొందరు కూడా సూపర్ ఎక్స్‌పీరియన్స్ అని రాసుకొచ్చారు. కాగా.. ట్విట్టర్‌లో ప్రేక్షకుల రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం.