పవన్‌ రీమేక్‌ ఆలస్యం

ABN , First Publish Date - 2022-07-17T07:35:37+05:30 IST

తమిళంలో విజయవంతమైన ‘వినోదయ సీతమ్‌’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడు.

పవన్‌ రీమేక్‌ ఆలస్యం

మిళంలో విజయవంతమైన ‘వినోదయ సీతమ్‌’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడు. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. తన ‘హరి హర వీరమల్లు’ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టి ఈ రీమేక్‌ని త్వరితగతిన పూర్తి చేయాలని పవన్‌ భావించారు. ఈవారంలోనే షూటింగ్‌ కూడా మొదలవ్వాలి. అయితే... ఇప్పుడు ఈ రీమేక్‌ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పవన్‌ ఇప్పుడు రాజకీయంగా బిజీగా ఉన్నారు. అందుకే.. సినిమా షూటింగ్‌కి సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. పవన్‌ కాల్షీట్లు ఇవ్వగానే ఈ సినిమాని పట్టాలెక్కించాలని దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. త్రివిక్రమ్‌ మరోసారి.. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకోబోతున్నారని తెలుస్తోంది. 

Updated Date - 2022-07-17T07:35:37+05:30 IST