యన్టీఆర్ - బుచ్చిబాబు సినిమా ప్రకటన అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-03-13T19:49:28+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది చిత్రం. దీని తర్వాత యన్టీఆర్ 30వ చిత్రం కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. అయితే దీంతో పాటు యన్టీఆర్ మరో సినిమాని కూడా సమాంతరంగా చేయబోతున్నాడని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు ‘ఉప్పెన’ తో సంచలనాలు రేపిన బుచ్చిబాబు సాన. మొదటి చిత్రంతో బ్లా్క్ బస్టర్ సొంతం చేసుకున్న బుచ్చిబాబు.. రెండో సినిమాని యన్టీఆర్ తో తెరకెక్కించాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కథ యన్టీఆర్ కు బాగా నచ్చిందని . సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్స్ వినిపించాయి.

యన్టీఆర్ - బుచ్చిబాబు సినిమా ప్రకటన అప్పుడేనా?

యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది చిత్రం. దీని తర్వాత యన్టీఆర్ 30వ చిత్రం కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. అయితే దీంతో పాటు యన్టీఆర్ మరో సినిమాని కూడా సమాంతరంగా చేయబోతున్నాడని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు ‘ఉప్పెన’ తో సంచలనాలు రేపిన బుచ్చిబాబు సాన.  మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న బుచ్చిబాబు.. రెండో సినిమాని యన్టీఆర్ తో తెరకెక్కించాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కథ యన్టీఆర్ కు బాగా నచ్చిందని . సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్స్ వినిపించాయి.


అయితే ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. తాజా సమాచారం ప్రకారం యన్టీఆర్, బుచ్చిబాబు కాంబో మూవీ పక్కాగా తెరకెక్కబోతోందని సమాచారం. మైత్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా అత్యంత భారీగా నిర్మాణం జరుపుకోనుంది. ఏప్రిల్ 11వ తేదీన సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఆ రోజు అధికారిక సమాచారం తో పాటు మిగతా వివరాలు కూడా తెలిసే అవకాశముంది. 

Updated Date - 2022-03-13T19:49:28+05:30 IST