శర్వా చేతి నుంచి మూడు పెద్ద చిత్రాలు జారిపోయాయా..?
ABN , First Publish Date - 2022-03-10T15:08:35+05:30 IST
శర్వా చేతి నుంచి మూడు పెద్ద చిత్రాలు జారిపోయాయా..? అంటే, ప్రస్తుతం అవుననే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ యంగ్ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

శర్వా చేతి నుంచి మూడు పెద్ద చిత్రాలు జారిపోయాయా..? అంటే, ప్రస్తుతం అవుననే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ యంగ్ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. శతమానంభవతి సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు శర్వా ఖాతాలో హిట్ అనేది పడలేదు. వరుసగా అరడజను సినిమాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరాయి. చెప్పాలంటే శర్వాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువే. కానీ, తన సినిమాలు ఎందుకో హిట్ కావడంలేదు. గమనిస్తే మాస్, క్లాస్ చిత్రాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
కానీ, ఆ కథలు ఆడియన్స్‌కు ఎక్కడం లేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం చిత్రాలతో పాటుగా ఇటీవల వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహార్లు కూడా హిట్ ఇవ్వలేకపోయిది. అయినా శర్వా భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మూడు పెద్ద ప్రొడక్షన్స్‌లో చేయాల్సిన సినిమాలు చేజారాయని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషస్ నిర్మించే సినిమాను చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ డాన్స్ కొరియేగ్రాఫర్ రాజు సుందరం తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
