Poonakaalu Loading: ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ‘వీరయ్య’ టీమ్
ABN , First Publish Date - 2022-12-30T21:27:15+05:30 IST
పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli), మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) మోస్ట్ ఎవైటెడ్ మూవీ
పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli), మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లోని నాల్గవ పాటను చూడాల్సిందే. ఈ పాటని హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో శుక్రవారం గ్రాండ్‌గా మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పిస్తోంది. మాస్ నంబర్‌లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).. అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్‌గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్‌గా పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్‌తో ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అనడం పూనకాలని రెట్టింపు చేసింది. చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌కు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్‌ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు. మెగామాస్ మ్యాజిక్‌ని బిగ్ స్క్రీన్ లపై చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.
ఈ ‘పూనకాలు లోడింగ్’ పాట విడుదల సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ టీమ్.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘‘బాస్ పార్టీ పాటని ఐపాడ్‌లో పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. అభిమానుల రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్ బాబుగారికి ఇష్టమైన జాతరలాంటి సినిమా వస్తుందని చెప్పాను. మనలాగే కళ్యాణ్‌గారు కూడా వాల్తేరు వీరయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో పూనకాలు లోడింగ్ కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు.. సినిమా మొత్తం పూనకాలు వస్తూనే వుంటాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విశ్వరూపం ‘వాల్తేరు వీరయ్య’. సినిమా అంతా జాతరలా వుంటుంది. ఇంత పూనకాలు తెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి థాంక్స్. ఇంత గొప్ప మ్యాజిక్ స్క్రీన్ ప్రజన్స్ వున్న ఇద్దరి గొప్ప స్టార్స్‌ని నా ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కి థాంక్స్. 13వ తేదీన పూనకాలు లోడింగ్ ఎనర్జీ ఏ స్థాయిలో వుంటుందో అందరూ చూడబోతున్నారు’’ అన్నారు. రోల్ రిడా మాట్లాడుతూ.. పూనకాలు లోడింగ్ పాట రాయడం నాఅదృష్టం. ఈ పాట రాయడం మెగామాస్ ఫీలింగ్. ఈ పాటని పాడటం కూడా జరిగింది. దర్శక నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. జనవరి 13న అందరం థియేటర్ లో కలుద్దాం.. అని తెలిపారు.
నిర్మాత వై రవిశంకర్ (Y Ravi Shankar) మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమాచేసే అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా కృతజ్ఞతలు. మేము అడిగిన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్యని గొప్పగా తీసిన దర్శకుడు బాబీ గారికి థాంక్స్. ‘పూనకాలు లోడింగ్’ పాటకు అభిమానులు ఐదుకి ఎంత రేటింగ్ ఇస్తే.. సినిమా కూడా అంతే రేటింగ్ లో వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. జనవరి 13వ తేదిన ఇంతకంటే ఎక్కువ ఆనందపడతారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు అని తెలపగా.. కోన వెంకట్ (Kona Venkat) మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో చిరంజీవిగారి కళ్ళల్లో చూశాను. ఇంత హ్యాపీగా బాస్ ని ఈ మధ్య కాలంలో చూడలేదు. మెగా ఫ్యాన్ బాబీ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని ఎంతో ప్రేమించి నిర్మించారు. 13వ తేదిన రికార్డులు ఎగురుతాయి.. అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సప్తగిరి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.