కన్నడ నటుడు చందన్‌ను బ్యాన్ చేయాలంటున్న టీవీ ఫెడరేషన్
ABN , First Publish Date - 2022-08-03T00:34:21+05:30 IST
న్నడ యాక్టర్ చందన్ ఒక సీరియల్ షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్‌ను చిన్న విషయానికే బండ బూతులు తిట్టి, కొట్టినట్టు వార్తలొచ్చాయి. దీనిని దర్శకుల సంఘం తో పాటు, టీవీ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ.. ఆ కన్నడ నటుడిని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

కన్నడ యాక్టర్ చందన్ ఒక సీరియల్ షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్‌ను చిన్న విషయానికే బండ బూతులు తిట్టి, కొట్టినట్టు వార్తలొచ్చాయి. దీనిని దర్శకుల సంఘం తో పాటు, టీవీ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ.. ఆ కన్నడ నటుడిని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కన్నడ మీడియాలో ఆ నటుడు తెలుగు టీవీ రంగం పై అసత్య ఆరోపణలు చేస్తూ.. అవమాన పరిచే విధంగా మాట్లాడడంతో. వాస్తవాలు తెలిపేందుకు... కన్నడ నటినటులను ఎందుకు బ్యాన్ చేయకూడదు..? అన్న విషయాల మీద ఈ రోజు (మంగళవారం) ప్రెస్ మీట్ జరిగింది. అందులో పాల్గొన్న పలువురు చందన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే...
చందన్ అనే కన్నడ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ ను కొట్టాడు..చందన్ గతంలో ఇలానే చాలాసార్లు బిహేవ్ చేశాడు.. కానీ ప్రతిసారి తను బయట నటుడు అని వదిలేయటం జరిగింది.. అసిస్టెంట్ డైరెక్టర్ ను పరిగెత్తించి మరీ యూనిట్ సభ్యుల ముందు కొట్టాడు.. దీనిపై యూనియన్ , చందన్ ను వివరణ అడిగి , క్షమాపణలు చెప్పమని అడిగింది.. చందన్ దానికి ఒప్పుకోకపోగా.. తెలుగువారు, కన్నడ వారిని చీప్ గా చూస్తున్నట్లు కన్నడ మీడియా ముందు ఆరోపిస్తున్నాడు. తెలుగువారికి ప్రాంతీయ భేదాలు లేవు. 60 సీరియల్స్ లో 240 మంది కన్నడ నటీనటులు వర్క్ చేస్తున్నారు.. ప్రాంతీయ భేదాలు తీసుకురావటానికి చందన్ ప్రయత్నిస్తున్నాడు.. చందన్ ఇక్కడ టాలెంట్ లేద అంటున్నాడు.రాజమౌళి ,పూరీ జగన్నాధ్, చోటా కె నాయుడు టీవి స్దాయి నుంచి ఎదిగిన వారే. ఎక్కువ వర్క్ సీరియల్స్‌లోనే ఉంది కాబట్టే, కన్నడ నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నాము.
- నాని, టీవి ఫెడరేషన్
చందన్ ను షాట్ కు రమ్మని నాలుగు సార్లు పిలిచాను.. నన్ను దుర్బాషలాడాడు. బయటకు రా చూసుకుందామని బెదిరించాడు..
-రంజిత్, అసిస్టెంట్ దర్శకుడు
రంజిత్ పై దాడి జరగటం బాధాకరం. చందన్ గతంలో కూడా మిస్ బిహేవ్ చేసిన సందర్భాలున్నాయి. ఇది ఇద్దరు వ్యక్తులు, ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన గొడవ. చందన్ దీన్ని ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అక్కడ తెలుగు వారిని భేదిరిస్తున్నట్టుగా తెలుస్తొంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. కన్నడ టీవి అసోసియేషన్ తో కలిసి తెలుగు టీవి అసోసియేషన్ సమస్యను సాల్వ్ చేసెందుకు సిద్ధంగా ఉన్నాము..
-సత్యనారాయణ , టివి దర్శకుడు