లాఠీ పవర్
ABN , First Publish Date - 2022-05-23T05:35:09+05:30 IST
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాఠీ’. సునైన కథానాయిక...

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాఠీ’. సునైన కథానాయిక. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ యూనిట్ రిలీజ్ పోస్టర్‌ని విడుదల చేసింది. సమాజంలో మంచి మార్పునకు నాంది పలుకుతూ విశాల్ తన ‘లాఠీ’ పవర్‌ను చూపిస్తారని చిత్ర దర్శకుడు అన్నారు. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధానాకర్షణ అని చిత్ర నిర్మాతలు రమణ, నందా తెలిపారు. సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు.