పెళ్లి కూతురు రెడీ అయిపోయింది
ABN , First Publish Date - 2022-04-05T08:10:00+05:30 IST
ప్రిన్స్, అర్జున్ కల్యాణ్, అనీషా ధామా, సీత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. ఏ.వి.ఆర్ స్వామి నిర్మాత...

ప్రిన్స్, అర్జున్ కల్యాణ్, అనీషా ధామా, సీత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. ఏ.వి.ఆర్ స్వామి నిర్మాత. అపర్ణ దర్శకత్వం వహించారు. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలూ పూర్తయ్యాయి. మే 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘‘రెండేళ్ల క్రితమే ఈ చిత్రం ప్రారంభమైంది. కానీ కరోనా వల్ల విడుదల ఆలస్యమైంది. ఇదో పూర్తి వినోద భరిత చిత్రం. ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంద’’న్నారు. ‘‘అందరినీ నవ్వించే చిత్రమిది. క్లీన్ ఎంటర్‌టైనర్’’ అని దర్శకురాలు చెప్పారు. ‘‘మేమంతా ఓ టీమ్‌లా కలిసి పనిచేశాం. మంచి ఫలితం వస్తుందన్న నమ్మకం ఉంద’’ని నటీనటులు తెలిపారు.