'ఆదిపురుష్‌'లో ఈ హీరోయిన్ కూడా..

ABN , First Publish Date - 2022-04-13T19:40:50+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్‌లో చేస్తున్న స్ట్రైట్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జంటగా సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.

'ఆదిపురుష్‌'లో ఈ హీరోయిన్ కూడా..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్‌లో చేస్తున్న స్ట్రైట్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జంటగా సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై...శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ నటిస్తుండగా, 'జన్నత్' సినిమాతో బాలీవుడ్‌లో.. 'లెజెండ్' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సోనాల్ చౌహాన్ కూడా 'ఆదిపురుష్' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించినట్టు స్వయంగా తనే ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు తెలిపింది. 


అయితే, ఏ పాత్రలో కనిపించబోతుందో మాత్రం రివీల్ చేయలేదు. హిందీలో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు లేకపోయినా తెలుగులో మాత్రం అలా అలా నెట్టుకొస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ది ఘోస్ట్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ముందు ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్న చిత్రబృందం..ఆమె ప్రగ్నెంట్ కావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆ అవకాశం సోనాల్‌కు దక్కింది. ఇక ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరక్కిస్తున్నారు. 

Updated Date - 2022-04-13T19:40:50+05:30 IST