హైదరాబాద్‌లో శ్రియా సరన్, శర్మాన్ జోషీల ‘మ్యూజిక్ స్కూల్’
ABN , First Publish Date - 2022-01-26T00:58:38+05:30 IST
ఎవరైతే అవసరమో వారినే సెట్ మీదకు రానిస్తున్నాం. సెపరేట్‌గా స్టూడియో, లొకేషన్లు అన్నింటిని కూడా శానిటైజ్ చేశారు. సెట్లో అందరం భౌతిక దూరాన్ని పాటిస్తున్నాం. ప్రతీ వారం అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేలా, సెట్లో ప్రతీరోజూ

రచయిత, దర్శకుడు పాపారావు బియ్యాల దర్శకత్వంలో.. ఇళయరాజా సంగీత సారథ్యంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. శర్మాన్ జోషి, శ్రియా సరన్ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని యామినీ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తునట్లుగా దర్శకుడు పాపారావు తెలియజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు పాపారావు మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్ స్కూల్ సినిమా రెండో షెడ్యూల్ అద్భుతంగా జరిగింది. టీం అంతా కూడా ఎంతో ఎంజాయ్ చేశాం. ఇక మూడో షెడ్యూల్‌ను కొత్త ఏడాదిలో కొత్త ఎనర్జీతో హైదరాబాద్‌లో ప్రారంభించాం. అదే సమయంలో అందరి రక్షణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైతే అవసరమో వారినే సెట్ మీదకు రానిస్తున్నాం. సెపరేట్‌గా స్టూడియో, లొకేషన్లు అన్నింటిని కూడా శానిటైజ్ చేశారు. సెట్లో అందరం భౌతిక దూరాన్ని పాటిస్తున్నాం. ప్రతీ వారం అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేలా, సెట్లో ప్రతీరోజూ జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని టీమ్ అంతా ఎంతో కష్టపడి పనిచేస్తోంది. మేరీ డిక్రూజ్, మనోజ్ (శ్రియా సరన్, శర్మాన్) పాత్రలు కళలు, సంగీతం, కల్చర్ విద్యల మీద ప్రభావం చూపించేలా ఉంటాయి..’’ అని తెలిపారు.