మీ.. మా కథలతో...
ABN , First Publish Date - 2022-03-21T06:57:55+05:30 IST
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన వేగేశ్న సతీష్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారు..

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన వేగేశ్న సతీష్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆంథాలజీ సిరీస్‌కు ‘కథలు (మీవి మావి) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే మూడు కథల షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథల షూటింగ్ పూర్తి చేసి, రిలీజ్ చేయనున్నారు. అసభ్యతకు తావులేకుండా కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఈ సిరిస్‌ను రూపొందిస్తున్నారు. నటీనటులు, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం వేగేశ్న సతీష్ ‘కోతికొమ్మచ్చి’, ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు.