Sai tej-Virupaksha: అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’
ABN , First Publish Date - 2022-12-08T17:52:17+05:30 IST
‘‘అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢ నమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజమైనప్పుడు... ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’ జూ ఎన్టీఆర్ నోట పలికిన ఈ డైలాగ్‌లు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.
‘‘అజ్ఞానం భయానికి మూలం.. ()
భయం మూఢ నమ్మకానికి కారణం.. (Virupaksha movie)
ఆ నమ్మకమే నిజమైనప్పుడు...
ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు
అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’
జూ ఎన్టీఆర్ నోట (Ntr launchedthe glimpse of Virupaksha)పలికిన ఈ డైలాగ్‌లు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. సాయి తేజ్(Sai tej) హీరోగా నటించిన ‘విరూపాక్ష’ చిత్రంలోని సంభాషణలివి. బుధవారం విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు చక్కని ఆదరణ వస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మిస్తోంది. కార్తీక్ దండు దర్శకుడు. బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయితేజ్ మాట్లాడుతూ ‘‘మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు నా థ్యాంక్స్. ఆయన నాపై చూపించిన ప్రేమ మరువలేనిది. ఆయనతో నా స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగించాలనుకుంటున్నా. మిస్టీక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకవెళుతుంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్‌డ్ విలేజ్‌లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో కొత్త సాయితేజ్‌ని చూస్తారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక తేజ్ చేస్తున్న చిత్రమిది. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో కష్టపడ్డాడు’’ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.