Jalsa 4K: కళ్లు చెదిరే కలెక్షన్లతో.. నెవ్వర్ బిఫోర్ రికార్డ్
ABN , First Publish Date - 2022-09-04T01:41:42+05:30 IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) బర్త్‌డేని పురస్కరించుకుని ఆయన నటించిన ‘జల్సా’ (Jalsa) చిత్రాన్ని 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఎన్ని షోలు పడతాయో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) బర్త్‌డేని పురస్కరించుకుని ఆయన నటించిన ‘జల్సా’ (Jalsa) చిత్రాన్ని 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఎన్ని షోలు పడతాయో కూడా క్లారిటీ లేదు.. కానీ బర్త్‌డే 2 రోజులు ఉందనగా.. రికార్డులు షేక్ అయ్యేలా దాదాపు 700కి పైగా స్ర్కీన్లలో ఈ సినిమాని విడుదల చేశారు. ఇంతకుముందు మహేష్ బాబు ‘పోకిరి’ చిత్రాన్ని కూడా ఆయన అభిమానులు రీ రిలీజ్ చేశారు. కానీ స్ర్కీన్ల పరంగానూ, కలెక్షన్ల పరంగానూ.. ‘జల్సా’ చిత్రాన్ని టచ్ కూడా చేయలేనంతగా.. ఒక్క స్పెషల్ షోస్‌తోనే రూ. 3.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టి.. నెవ్వర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసింది. నార్మల్‌గా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా డైరెక్ట్‌గా థియేటర్లలోకి విడుదలైన రోజు కూడా ఈ స్థాయి కలెక్షన్స్‌ను రాబట్టలేకపోతున్న రోజులివి. అలాంటిది కేవలం స్పెషల్ షోస్‌తోనే రికార్డులు క్రియేట్ చేసేంత సత్తా, దమ్ము మాలో ఉందని మరోసారి నిరూపించారు పవర్ స్టార్ ఫ్యాన్స్. దీంతో ఫ్యాన్స్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా.. అని మరోసారి నిరూపించుకున్నారు. కాగా, ‘జల్సా’ స్పెషల్ షోలు రాబట్టిన కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి.
- ఏరియా కలెక్షన్లు (గ్రాస్‌లో)
- నైజాం -1,25,61,147
- సీడెడ్ - 39,03,095
- నెల్లూరు - 10,95,996
- గుంటూరు -10,87,388
- కృష్ణ -21,66,000
- వెస్ట్ -14,34,640
- ఈస్ట్ -8,55,800
- వైజాగ్ -26,40,295
- రెస్టాఫ్ ఇండియా -22,26,400
- ఓవర్సీస్ -40,50,000
- టోటల్ వరల్డ్ వైడ్- 3,20,20,761
