టైగర్ వేట మొదలు
ABN , First Publish Date - 2022-04-02T05:30:00+05:30 IST
‘కరోనా సమయంలో దర్శకుడు వంశీ ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ నాకు చెప్పాడు. చాలా బాగా నచ్చింది. కానీ ఆ సినిమా చేయడం వీలు కాలేదు.

‘కరోనా సమయంలో దర్శకుడు వంశీ ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ నాకు చెప్పాడు. చాలా బాగా నచ్చింది. కానీ ఆ సినిమా చేయడం వీలు కాలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని చిరంజీవి అన్నారు. ఉగాది సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛన ంగా ప్రారంభమైంది. రవితేజ హీరోయిన్లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ పైన చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చిరంజీవి క్లాప్ ఇచ్చారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గౌరవ దర్శకత్వం వహించగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ర్కిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందజేశారు. అనంతరం చిరంజీవి ప్రీ లుక్ పోస్ట్‌ర్‌ని విడుదల చేశారు. రవితేజ అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో విభిన్నపాత్రను పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని రేణూదేశాయ్ అన్నారు.