Rashmi Gautam: సుధీర్‌తో బంధంపై రష్మీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-11-08T20:47:42+05:30 IST

‘జబర్దస్త్’ (Jabardasth) షో ద్వారా పాపులర్ అయినవారు ఎందరో ఉన్నారు. వారిలో సుధీర్ (Sudheer), రష్మీ గౌతమ్‌ (Rashmi Gautham)ల మధ్య బాండింగ్ ఎప్పటికీ

Rashmi Gautam: సుధీర్‌తో బంధంపై రష్మీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు

‘జబర్దస్త్’ (Jabardasth) షో ద్వారా పాపులర్ అయినవారు ఎందరో ఉన్నారు. వారిలో సుధీర్ (Sudheer), రష్మీ గౌతమ్‌ (Rashmi Gautham)ల మధ్య బాండింగ్ ఎప్పటికీ హాట్ టాపిక్కే. అసలు వారిద్దరి మధ్య ఏముందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఒకసారి వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, మరోసారి వాళ్లిద్దరికీ పెళ్లి అయిపోయిందనేలా వార్తలు రావడమే కాదు.. బుల్లితెరపై వారు చేసే షోలలో కూడా వారిద్దరికి ఎన్నో సార్లు పెళ్లి చేశారు. ఇన్ని జరిగినా కూడా వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటనేది ఎవరికీ తెలియదు. వారు కూడా నవ్వుతారే తప్ప.. సరైన సమాధానం ఇచ్చిందీ లేదు. ఇక ఈ మధ్య ఇలాంటి వార్తలపై రష్మీ అసహనానికి గురవుతోంది. ఎందుకంటే, ఆమె ఎక్కడికి వెళ్లినా.. అక్కడి మీడియా ముందు అడిగే ప్రశ్న ఇదే కావడం విశేషం. తాజాగా మరోసారి రష్మీకి ఇదే ప్రశ్న ఎదురైంది. ఈసారి ఆమె కాస్త ఘాటుగానే ఆన్సర్ ఇచ్చింది. ‘‘నా గురించి పదే పదే పబ్లిక్‌కి చెప్పడం.. అదే నా జీవితం కాదు.. అది నా పర్సనల్ విషయం’’ అంటూ రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


‘‘మా మధ్య ఎటువంటి బంధమైనా ఉండి ఉండవచ్చు. దాని గురించి పదే పదే పబ్లిక్‌లో ప్రతి ఒక్కరికీ వివరించలేను. అది నా వ్యక్తిగత విషయం. దానిపై పబ్లిక్‌లో పదే పదే ప్రస్తావించడమే నా జీవితం కాదు. భవిష్యత్‌లో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. జరిగేది మాత్రం అందరికీ తెలుస్తూనే ఉంటుంది. మా వరకు వస్తే.. మేమిద్దరం ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటామో.. ఆన్ స్క్రీన్‌లో కూడా అలాగే ఉంటాం. మా కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌లా అందరినీ ఆకర్షించింది. ఇదంతా మేము అనుకుని చేసింది కాదు. మాది పదేళ్ల జర్నీ. ప్రతిసారి మా మధ్య ఏముందో చెప్పాల్సిన అవసరం లేదు’’ అని రష్మీ సమాధానమిచ్చింది. మరి ఆమె ఇచ్చిన ఈ క్లారిటీ తర్వాతైనా.. వారి బంధంపై వచ్చే వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం. (Rashmi about Relation with Sudheer)

Updated Date - 2022-11-08T20:47:42+05:30 IST