Poonam Kaur: పెళ్లయిపోయిందా.. నెటిజన్లపై ఫైర్‌!

ABN , First Publish Date - 2022-10-15T21:04:04+05:30 IST

పూనమ్‌ కౌర్‌ పరిచయం అక్కర్లేని పేరు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పూనమ్‌ పేరు మరోసారి వైరల్‌ అవుతోంది.

Poonam Kaur: పెళ్లయిపోయిందా.. నెటిజన్లపై ఫైర్‌!

పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur)పరిచయం అక్కర్లేని పేరు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పూనమ్‌ పేరు మరోసారి వైరల్‌ అవుతోంది. ఉత్తరాది ప్రజలు భర్త క్షేమం కోరుతూ కర్వాచౌత్‌ (KarwaChauth) పూజను నిర్వహిస్తారు. పెళ్లయిన మహిళలు ప్రత్యేకంగా జరుపుకొనే ఈ వేడుకను శుక్రవారం పూనమ్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు పూనమ్‌పై విమర్శలు మొదలుపెట్టారు. ‘పెళ్లి కానీ మీరు కర్వాచౌత్‌ ఎలా జరపుకుంటారు?’, ‘అంటే మీకు పెళ్లయిపోయిందా? పెళ్లి చేసుకోబోతున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై ప్రశ్నలు సంధించారు. (Poonam Kaur Fire on netizens)


నెటిజన్‌ ప్రశ్నలను పూనమ్‌ ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసి ఘాటుగా స్పందించారు. ‘ఈ ఆర్టికల్స్‌ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచనలతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్‌ను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. కాబోయే భర్త కోసం పెళ్లి కాని మహిళలు ఈ వేడుక నిర్వహించుకుంటారు. పెళ్లయిన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే, పెళ్లికాని అమ్మాయిలు చుక్కలను ఆరాధిస్తారు. పరమేశ్వరుడినికూడా కొలుస్తారు’’ అని చెప్పుకొచ్చింది. 






Updated Date - 2022-10-15T21:04:04+05:30 IST