ప్రతి సన్నివేశం క్లైమాక్స్‌లా...

ABN , First Publish Date - 2022-12-17T00:18:11+05:30 IST

సిజు విల్సన్‌ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పాథోన్‌పథం నూట్టండు’. తెలుగులో..

ప్రతి సన్నివేశం క్లైమాక్స్‌లా...

సిజు విల్సన్‌ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పాథోన్‌పథం నూట్టండు’. తెలుగులో ‘పులి’ పేరుతో నిర్మాత సి.హెచ్‌ సుధాకర్‌బాబు విడుదల చేస్తున్నారు. ‘ద 19 సెంచరీ’ అన్నది ఉపశీర్షిక. కాయాదు లోహర్‌ కథానాయిక . గురువారం ఈచిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ ‘యాక్షన్‌ పీరియడ్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ఇది. సమాజంలో అసమానతలపై పోరాడిన ఓ వీరుడి గాథతో రూపొందింది. ప్రతి సన్నివేశం క్లైమాక్స్‌లా ఉంటుంది’ అన్నారు. ‘ఇది రియల్‌లైఫ్‌ స్టోరీ, అన్ని వాణిజ్య హంగులతో చిత్రాన్ని రూపొందించాం’ అని సిజు విల్సన్‌ అన్నారు. ‘కేరళ ప్రజలు ఆదరించారు, తెలుగు ప్రేక్షకులు కూడా ‘పులి’ సినిమా చూడాల’ని చిత్ర దర్శకుడు వినయన్‌ కోరారు.

Updated Date - 2022-12-17T00:18:12+05:30 IST