సమాజానికో ప్రశ్న

ABN , First Publish Date - 2022-05-14T05:37:24+05:30 IST

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం, ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ఐశ్వర్య జంటగా సిద్దార్థ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ‘దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకటరమణ ఈ సినిమాకు దర్శకుడు....

సమాజానికో ప్రశ్న

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం, ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ఐశ్వర్య జంటగా సిద్దార్థ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ‘దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకటరమణ ఈ సినిమాకు దర్శకుడు. చిత్రం గురించి ఆయన వివరిస్తూ ‘ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యంగంలోని ఆర్టికల్‌ 20 చెబుతోంది. కానీ దానికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్‌ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. ఇందులో ఓ విభిన్న ప్రేమకథను కూడా చూపిస్తున్నాం’ అని తెలిపారు.


చిత్ర నిర్మాత సిద్ధార్థ హరియాల మాట్లాడుతూ ‘సమాజాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే సినిమా ఇది. ఈ నెల 25న షూటింగ్‌ ప్రారంభించి కాకినాడ, యానాం, హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తాం’ అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు నటించే ఈ చిత్రానికి మాటలు: సురేశ్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: జి. అమర్‌, సమర్పణ: వేదుల బాలకామేశ్వరి, నిర్మాతలు: సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి.

Updated Date - 2022-05-14T05:37:24+05:30 IST