హీరోని కాదు విలన్ని
ABN , First Publish Date - 2022-06-13T06:24:06+05:30 IST
‘నేను హీరోని కాదు విలన్ని’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. రాశీ ఖన్నా కథానాయిక...

‘నేను హీరోని కాదు విలన్ని’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. రాశీ ఖన్నా కథానాయిక. జులై 1న విడుదలవుతోంది. ఆదివారం గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో లాయర్‌గా, ఫైటర్‌గా, ప్రేమికుడిగా విభిన్నపాత్రల్లో గోపిచంద్ ఒదిగిపోయారు. పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ నిర్మించాయి. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.