జనవరిలో కాదు.. జూన్‌లో!
ABN , First Publish Date - 2022-11-08T06:01:42+05:30 IST
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం ముందు ప్రకటించిన విధంగా 2023 సంక్రాంతికి విడుదల కావాలి....

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం ముందు ప్రకటించిన విధంగా 2023 సంక్రాంతికి విడుదల కావాలి. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకోవడంతో ఈ సారి ముగ్గుల పండుగ మరింత రసవత్తరంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే ‘ఆదిపురుష్’ చిత్ర దర్శకనిర్మాతల ప్లాన్ మారింది. సినిమాను సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఓం రౌత్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. సినిమాలోని సీజీ వర్క్ విషయంలో అందరూ పెదవి విరుస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించడం కోసం సినిమా విడుదలను జూన్‌కు మార్చినట్లు ఓం రౌత్ పేర్కొన్నారు. ‘ఆదిపురుష్ సినిమా మాత్రమే కాదు.. శ్రీరాముడు పట్ల మాకున్న భక్తిని, మన సంస్కృతిని, చరిత్రను చాటే ప్రయత్నం. ఒక విజువల్ వండర్‌గా దీనిని చిత్రీకరించేందుకు టెక్నికల్ టీమ్‌కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని ఆ ప్రకటనలో ఓం రౌత్ పేర్కొన్నారు.