Bigg Boss 6: అతనే కారణం.. రివేంజ్ తీర్చుకుంటా!
ABN , First Publish Date - 2022-09-27T00:10:27+05:30 IST
బిగ్‌బాస్ సీజన్–6లో మూడోవారం ఎలిమినేషన్స్ ద్వారా యాంకర్ నేహా చౌదరి బయటకు వచ్చారు. అసలు ఇంటి నుంచి ఇనయా బయటకు వెళ్లుందని అనుకున్నారంతా. నెట్టింట కూడా అదే వార్త చక్కర్లు కొట్టింది.

బిగ్‌బాస్ సీజన్–6 (Biggboss 6)లో మూడోవారం ఎలిమినేషన్స్ (Eliminations)ద్వారా యాంకర్ నేహా చౌదరి (Neha revange on revanth)బయటకు వచ్చారు. అసలు ఇంటి నుంచి ఇనయా (Inaya)బయటకు వెళ్లుందని అనుకున్నారంతా. నెట్టింట కూడా అదే వార్త చక్కర్లు కొట్టింది. చివరికి ఇనయా సేఫ్ అయింది. చివరి రౌండ్లో వాసంతి, నేహా మధ్య పోటీ జరిగింది. దానితో నేహా ఎలిమినేట్ అయింది. హౌస్‌లో ఆట పట్ల సీరియస్‌నెస్ లేని సభ్యులు చాలా మంది ఉన్నా నేహా బయటకు వెళ్లడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేట్ కావడంపై నేహా చౌదరి కూడా షాక్ అయ్యారు. నమ్మినవాళ్లే మోసం చేశారని, తాను ఇంట్లో నుంచి బయటకు రావడానికి రేవంత్ కారణమని బయటకు వచ్చిన ఆమె నాగార్జునతో చెప్పింది. బాగా ఆడినప్పటికీ ఎందుకు బయటకు వచ్చానో తెలియడం లేదని నేహా చౌదరి పేర్కొన్నారు. హౌస్ ఆడని వాళ్లు. పని చేయని వాళ్లు చాలామంది ఉన్నారని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం వస్తే మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్తానని, అక్కడ రివేంజ్ తీసుకోవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. రాజ్‌కి జాగ్రత్తలు చెప్పారు. చివరిగా నాగ్ ఇచ్చిన టాస్క్ దమ్ము–దుమ్ము ఆట ఆడి... చంటి, సుదీప, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, బాలాదిత్య దమ్ము కేటగిరీలో ఉంటారని, రేవంత్, ఆరోహి, గీతూ, అర్జున్, వాసంతి, ఇనాయా దుమ్ము కేటగిరీలో ఉన్నారనీ నిజాయతీగా ఆట ఆటడం లేదని, స్వార్థంగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చింది.
