ప్రేమ ‘పడవ’

ABN , First Publish Date - 2022-03-24T05:37:44+05:30 IST

‘శతమానం భవతి’ చిత్రంతో నేషనల్‌ అవార్డ్‌ అందుకొన్న దర్శకుడు వేగేశ్న సతీశ్‌ ‘కథలు’ (మీవి-మావి)అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి...

ప్రేమ ‘పడవ’

‘శతమానం భవతి’ చిత్రంతో నేషనల్‌ అవార్డ్‌ అందుకొన్న దర్శకుడు వేగేశ్న సతీశ్‌ ‘కథలు’ (మీవి-మావి)అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇందులో మొదటి కథ ‘పడవ’ మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు హరీశ్‌శంకర్‌ విడుదల చేసి టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇందులో వేగేశ్న సతీష్‌ తనయుడు సమీర్‌ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించారు. ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా ‘పడవ’ రూపుదిద్దుకొంది. ఇది కాక ఈ సిరీస్‌కు సంబంధించి మరో రెండు కథలు షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. మిగిలిన కథలు నిర్మాణంలో ఉన్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ‘కథలు’ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. వీటికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: శ్రీమణి, ఫొటోగ్రఫీ: దాము, ఎడిటింగ్‌: మధు, నిర్మాతలు: వేగేశ్న సతీష్‌, దుష్యంత్‌.


Updated Date - 2022-03-24T05:37:44+05:30 IST