KGF 2: చిత్రబృందంపై ఐకాన్ స్టార్ ప్రశంసల జల్లు..

ABN , First Publish Date - 2022-04-22T18:48:46+05:30 IST

ఇటీవల పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కెజీఎఫ్ ఛాప్టర్ 2. కెజీఫ్ 1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా ప్రశాంత్ నీల్‌కు హీరోగా రాకింగ్ స్టార్ యష్‌కు భారీ క్రేజ్ తీసుకువచ్చింది.

KGF 2: చిత్రబృందంపై ఐకాన్ స్టార్ ప్రశంసల జల్లు..

ఇటీవల పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కెజీఎఫ్ ఛాప్టర్ 2. కెజీఎఫ్ 1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా ప్రశాంత్ నీల్‌కు, హీరోగా రాకింగ్ స్టార్ యష్‌కు భారీ క్రేజ్ తీసుకువచ్చింది. మేకింగ్ పరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ - నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే, బాక్సాఫీస్ వద్ద దాదాపు 600 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన కెజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదలైన అన్నీ భాషలలో సత్తా చాటుతూ దూసుకువెళుతోంది. 


ఈ నేపథ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన ఐకాన్ స్టార్.."కేజీఎఫ్ చిత్రబృందానికి అభినందనలు. యష్ పర్ఫార్మెన్స్ అద్భుతం..సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి అయస్కాంతంలా తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ది బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..రవి బస్రూర్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇతర టెక్నీషియన్స్ అందరినీ ఈ సందర్భంగా గౌరవిస్తున్నాను" అంటూ పేరొన్నారు. ప్రస్తుతం బన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అల్లు అర్జున్ ట్వీట్‌కి రవీనా టాండన్ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు థాంక్స్ చెప్పారు. నేను మీకు పెద్ద అభిమానిని అని రాసుకొచ్చారు. 





Updated Date - 2022-04-22T18:48:46+05:30 IST