Kavya Thapar: స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్
ABN, First Publish Date - 2022-10-30T00:05:42+05:30
‘ఈ మాయ పేరేమిటో’ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కావ్య థాపర్ (Kavya Thapar). ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha) లో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. భాషతో సంబంధం
‘ఈ మాయ పేరేమిటో’ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కావ్య థాపర్ (Kavya Thapar). ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha) లో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుందీ ముద్దుగుమ్మ. కావ్య తాజాగా భారీ ఆఫర్‌ను కొట్టేసింది. స్టార్ హీరో చిత్రంలో అవకాశాన్ని చేజిక్కిచుకుంది.
కావ్య థాపర్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సరసన నటించనుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్రను పోషించనుంది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాడు. బిగ్ ప్రొడక్షన్ హౌస్ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాలీవుడ్ మూవీ జాన్ విక్ (John Wick)తో స్ఫూర్తి పొంది కార్తిక్ ఈ కథను రాసుకున్నాడట. ఈ మూవీకి టైటిల్ నిర్ణయించలేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పోలండ్‌లో జరుగుతుంది. రవితేజతో నటిస్తుండటంతో కావ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘నేను గతంలోనే ఈ సినిమాకు సంతకం చేశాను. ఓ చిత్రంలో నటిస్తుండగానే మరో ప్రాజెక్టులో అవకాశం రావడం సంతోషంగా ఉంది. రవితేజ్ అంటెనే పుల్ ఆఫ్ ఎనర్జీ. లుక్ టెస్ట్ కోసం నేను అతడిని కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాను. ప్రస్తుతం మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాను’’ అని కావ్య థాపర్ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలుపుతారు.