శ్రీకాంత్ వదిలిన ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్..

ABN , First Publish Date - 2022-04-13T20:04:02+05:30 IST

నూతన నటీ నటులతో వైవిధ్యమైన జానర్‌లో ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఎస్‌ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్‌ను

శ్రీకాంత్ వదిలిన ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్..

నూతన నటీ నటులతో వైవిధ్యమైన జానర్‌లో ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఎస్‌ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే, సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.


దర్శక, నిర్మాత ఎమ్‌ఎన్‌వి సాగర్‌ మాట్లాడుతూ.. ‘‘కళ కోసం కలగని ఇష్టంతో కష్టపడుతున్న మా చిత్ర బృందానికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ శ్రీకాంత్‌ గారి చేతుల మీదుగా విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నతమైన విలువలతో ఊహించని ట్విస్ట్‌లతో నేను రూపొందిస్తున్న ఈ సినిమాకి నాతో పాటుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నాము. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని తెలిపారు.

Updated Date - 2022-04-13T20:04:02+05:30 IST